నాగ చైతన్య తాజాగా రానా దగ్గుబాటి హోస్ట్ గా చేస్తున్న ఓ టాక్ షోకు గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ టాక్ షోలో నాగ చైతన్య పలు సరదా ముచ్చట్లు పంచుకున్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. ఓ హీరోయిన్ అంటే తనకు వణుకు అని చెప్పాడు. ఆమె ఎవరు అని రానా అడగగా సాయి పల్లవి అని చెప్పుకొచ్చాడు. సాయి పల్లవితో నటించాలన్నా, డాన్స్ చేయాలన్నా తనకు వణుకు అని తెలిపాడు. కాగా, చైతు హీరోయిన్ శోభిత దూళిపాళ్ల ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.