రైతుల ఖాతాల్లోకి పంట నష్టపరిహారం డబ్బులు

53756చూసినవారు
రైతుల ఖాతాల్లోకి పంట నష్టపరిహారం డబ్బులు
తెలంగాణలో ఇటీవల వడగళ్లు, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 15,246 మంది రైతులకు చెందిన 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తేల్చింది. `ఎకరానికి రూ.10వేల చొప్పున రూ.15.81 కోట్లు చెల్లించనుంది. ఈసీ అనుమతితో ఇవాళ, రేపు రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్