3 సెకన్లలో 3 దేశాలను చుట్టేసింది (వీడియో)

81చూసినవారు
మూడు దేశాలలో పర్యటించాలంటే అందుకు చాలా సమయం, డబ్బులు ఖర్చు అవుతాయి. ఓ మహిళ మాత్రం కేవలం 3 సెకన్లలో 3 దేశాలలో పర్యటించింది. ఇదెలా సాధ్యమైందని అనుకుంటున్నారా? ఈ మూడు దేశాలను కలిపే సరిహద్దులోని హెట్ డ్రైలాండ్‌పంట్ (త్రీ కంట్రీ పాయింట్) వద్దకు ఆమె వెళ్లింది. తొలి అడుగులో బెల్జియం, రెండో అడుగులో నెదర్లాండ్స్, మూడో అడుగులో జర్మనీలో ఆమె అడుగు పెట్టి సంతోషంలో గంతులేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్