TG: రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ఆదివారం కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కలిశారు. హన్మకొండ పర్యటనకు వచ్చినపుడు ఎమ్మెల్యే ఆయనను కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చలు జరిపారు. అనంతరం వినతి పత్రం ఇచ్చారు. వేయిస్తంభాల గుడి అభివృద్ధి కోసం కేంద్రం నిధులు కేటాయించాలని కిషన్‌రెడ్డిని ఆయన కోరారు. అయితే ఆయన భేటీ కాంగ్రెస్ పార్టీలో చర్చినీయాంశంగా మారింది.