తిరుపతి జిల్లా చంద్రగిరిలో జల్లికట్టు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో హీరో మంచు మనోజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. నాగాలమ్మ సర్కిల్‌లోని శ్రీకృష్ణ మందిరం వరకు అభిమానులతో ర్యాలీ నిర్వహించారు. జల్లికట్టులో దేవతలు, సినీ, రాజకీయ ప్రముఖుల చిత్రపటాలతో ఎద్దుల పలకలు తయారుచేసి పోటీలు నిర్వహించారు.