ఉద్యోగంలో ఒత్తిడితో ఓ ఉద్యోగి తన ఎడమ చేతి వేళ్లను తానే నరికేసుకున్నాడు. వారం రోజుల క్రితం సూరత్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని ఓ నగల దుకాణంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న 32 ఏళ్లవ్యక్తి.. చేతి వేళ్లు కోసుకున్నాడు. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేయాలన్న కసితో, తనకు తానే హాని తలపెట్టుకున్నానని పోలీసుల సమక్షంలో బాధితుడు ఒప్పుకున్నాడు. తనపై దాడి జరిగిందని తొలుత నమ్మించాలని చూసినా పోలీసుల విచారణలో అసలు విషయం చెప్పాడు.