తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ‘మీసేవ’ కేంద్రాలకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి పౌరసరఫరాల శాఖ స్పందించింది. ‘రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ. దరఖాస్తుల సమర్పణకు ఎలాంటి గడువు లేదు. ప్రజావాణిలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ చేయొద్దు. కులగణన, ప్రజాపాలనలో దరఖాస్తు చేస్తే మళ్లీ అవసరం లేదు. మీ సేవలో దరఖాస్తు చేసిన రసీదును ఎక్కడా ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేసింది.