ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో గత ఛాంపియన్స్‌పై ఓ లుక్కేద్దాం. 1998లో జరిగిన తొలి ఎడిషన్‌లో సౌతాఫ్రికా విజేతగా అవతరించింది. 2000లో న్యూజిలాండ్ గెలవగా.. 2002లో శ్రీలంక - టీమిండియా కలిసి సంయుక్తంగా ట్రోఫీని గెలుచుకున్నాయి. 2004లో వెస్టిండీస్, 2006, 2009లో ఆస్ట్రేలియా రెండుసార్లు కప్‌ను సొంతం చేసుకుంది. 2013లో టీమిండియా, 2017లో పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకున్నాయి.