మహిళలు గులాబీ రేకులతో తమ అందాన్ని రెండింతలు పెంచుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కళ్ల కింద నల్లటి వలయాలతో యువతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి వారు గులాబీ పత్రాలను రోజ్ వాటర్‌లో వేసి నానబెట్టి తర్వాత దానిని ముఖానికి రాసుకోవాలి. గులాబీ రేకల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మంపై వచ్చే దురద, మంటను తగ్గిస్తాయి. అలాగే చర్మంపై జిడ్డును తొలగించి చర్మ సౌందర్యాన్ని పెంచుతాయని వివరిస్తున్నారు.