కేజ్రీవాల్, కవితకు కస్టడీ పొడిగింపు

45053చూసినవారు
కేజ్రీవాల్, కవితకు కస్టడీ పొడిగింపు
ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు షాక్ తగిలింది. వారికి జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మే 7 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించినట్లు ఉత్తర్వుల్లో కోర్టు పేర్కొంది. తీహార్ జైలు నుంచి సీఎం కేజ్రీవాల్, కవితలను వర్చువల్‌గా కోర్టు ముందు పోలీసులు హాజరుపరిచారు.

సంబంధిత పోస్ట్