తెలంగాణ శాసనమండలి ఆవరణలో BRS ఎమ్మెల్సీలు వినూత్న తరహాలో నిరసన తెలిపారు. సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇచ్చే హామీని అమలు ఎక్కడ అని ప్రశ్నించారు. తక్షణమే తులం బంగారం ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బంగారు కడ్డీలను పోలిన వాటిని ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఇప్పటివరకు పెళ్లయిన వారికి కూడా తులం బంగారం ఇవ్వాల్సిందేనని BRS ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు.