బంగారానికి ధరల సెగ తగిలింది. ప్రస్తుత ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశీయంగా పసిడి డిమాండ్ 5శాతం తగ్గి 149.7 టన్నులకు పడిపోయిందని ప్రపంచ స్వర్ణ మండలి(డబ్ల్యూజీసీ) మంగళవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో 158.1 టన్నులకు పసిడి గిరాకీ ఉన్నట్టు పేర్కొంది. కాగా, పరిమాణం పరంగా డిమాండ్ తగ్గినప్పటికీ దాని విలువ మాత్రం 17 శాతం పెరిగినట్లు తెలిపింది.