తెలంగాణలో 'గేమ్ ఛేంజర్' మూవీ స్పెషల్ షోలను రద్దు చేస్తూ రాష్ట్ర హోంశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రేపటి ఉదయ నుంచి స్పెషల్ షోలు నిలిచిపోనున్నాయి. శనివారం హైకోర్టులో టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోలపై శనివారం విచారణ జరిగింది. బెనిఫిట్ షోలను రద్దు చేసి స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వడాన్ని న్యాయస్థానం ఆక్షేపించింది. దీనిపై పునరాలోచించాలని తెలిపింది. ఈ నేపథ్యంలో స్పెషల్ షోలను ప్రభుత్వం రద్దు చేసింది.