డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తన అభిప్రాయాన్ని మీడియా ముందు వ్యక్తం చేశారు. జనాభా ప్రకారం డీలిమిటేషన్ చేస్తే సీట్లు తగ్గుతాయని.. తద్వారా అన్ని కార్యకలాపాలకు విఘాతం కలిగే అవకాశం ఉందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో డీలిమిటేషన్‌ను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.