వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ, అధిక దిగుబడులను సాధించే మూడు కొత్త వంగడాలను ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దేశీ శనగలో నంద్యాల గ్రామ్, పెసరలో లాం పెసర, వేరుశనగలో ఐసీఏఆర్ కోణార్క్ (టీసీజీఎస్ 1707) రకాలను వర్శిటీ అభివృద్ధి చేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రబీ సీజన్‌కు ఇవి అనుకూలంగా ఉంటాయి. ఈ రకాల సాగుతో రైతులు అధిక దిగుబడులు పొందవచ్చు.