ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. 10 రోజుల్లోనే ఏకంగా 10 కోట్లమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. త్రివేణి సంగమ స్థలికి భక్తులు బారులు తీరుతున్నారు. కుంభమేళాకు చేరుకోవడానికి రైళ్లు, విమానాలపై ఆధారపడుతున్నారు. 45 రోజులపాటు సాగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల సంఖ్య 50 కోట్లు దాటుతుందని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది.