AP: YCPకి TDP థ్యాంక్స్ చెప్పింది. అప్పులు తెచ్చి రాజధాని కడుతున్నారని YCP విమర్శలు చేసింది. ఇక్కడే YCP ఓ విషయాన్ని మరచిపోయిందని TDP సెటైర్లు వేస్తూ ఓ ట్వీట్ చేసింది. రాజధాని కోసం ప్రపంచ బ్యాంకు ఇచ్చే రుణాలు ఏపీ అప్పుల పరిమితిలోకి రావని స్పష్టం చేసింది. YCP ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇవ్వడంతో తమ ఎంపీ ద్వారానే, తమది ఫేక్ ప్రచారం అని ప్రజలకు YCPకి తెలియజేసినందుకు థ్యాంక్స్ అని TDP పేర్కొంది.