AP: శ్రీశైలంలో భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి నిత్యం అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తులు నకిలీ వెబ్ సైట్లను నమ్మి మోసపోవద్దని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. వసతి, దర్శనం, ఆర్జిత సేవల టికెట్లను అధికారిక వెబ్ సైట్లోనే బుకింగ్ చేసుకోవాలని తెలిపారు. దేవస్థానం వివరాలకు 8333901351, 52, 53 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.