సమయానికి చేరుకునేలా ఉచిత బస్సులు: మంత్రి రాంప్రసాద్

82చూసినవారు
సమయానికి చేరుకునేలా ఉచిత బస్సులు: మంత్రి రాంప్రసాద్
AP: పదో తరగతి విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ఉచితంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. స్టూడెంట్స్ అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకొని, జయప్రదంగా పరీక్షలు రాయాలని మంత్రి ఆకాంక్షించారు. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. రేపటి నుంచి 6.15 లక్షల మంది టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్