సోషల్ మీడియాలో ప్రతిరోజూ వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా హృదయ విదారక దృశ్యం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఒక ఏనుగు అకస్మాత్తుగా నేలపై కుప్పకూలి మరణించింది. అది చూసిన మరో ఏనుగు చనిపోయిన స్నేహితుడిని మేల్కొలపడానికి చాలా ప్రయత్నిస్తుంది. 25 సంవత్సరాలు రష్యా సర్కస్‌లో కలిసి పనిచేసిన ఈ రెండు ఏనుగుల పేర్లు 'జెన్నీ' మరియు 'మాగ్డా'. ఈ వీడియో చూసిన నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు.