IPL కొత్త నిబంధనలపై విరాట్ కోహ్లీ సీరియస్ అయ్యారు. ఆటగాళ్ల పర్యటనలో కుటుంబాలను తీసుకెళ్లకూడదన్న IPL నిబంధనలపై కోహ్లీ ఘాటుగా స్పందించారు. ఆదివారం కోహ్లీ మాట్లాడుతూ.. "మ్యాచ్‌లు తీవ్ర ఒత్తిడితో ఆడుతుంటాం. మ్యాచ్ పూర్తయ్యాక కుటుంబం చెంతకు చేరడం ఎంతో రిలీఫ్‌ని ఇస్తుంది. కుటుంబం తమతో ఉండటం ఎంత అవసరమో కొంత మందికి తెలియట్లేదు. మ్యాచ్ ముగిశాక రూమ్‌లో ఒంటరిగా చింతిస్తూ కూర్చోవాలా?" అని నిలదీశారు.