2017లో పాక్‌తో జరిగిన మ్యాచ్ నేటికీ పీడకలలా మిగిలింది. పాక్ విధించిన 339 లక్ష్యాన్ని చేరుకోలేక భారత్ ఘోరంగా విఫలమైంది. 158 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో తొలిసారి పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది.
ఆనాటి ఫైనల్‌లో ఘోర ఓటమికి బదులు తీర్చుకొనే అవకాశం టీమ్ ఇండియాకు వచ్చింది. దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఇరు జట్ల మధ్య ఫలితాల లెక్కను 3-3తో సరిచేయాలని భావిస్తోంది.