రైతులకు తక్కువ ఖర్చుతో అధిక రాబడినిచ్చే పంటలలో నువ్వులు కూడా ఒకటి. నువ్వుల సాగు చేపట్టాలనుకునే రైతులు.. ఎర్లీ ఖరీఫ్ మే 2వ పక్షం వరకు, లేట్ ఖరీఫ్ ఆగస్టు 2వ పక్షం వరకు విత్తుకోవచ్చు. అయితే, ఖరీఫ్‌లో సాగుచేస్తే తెగుళ్ల బెడద అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వేరుకుళ్లు, కాండంకుళ్లు తెగులు ఆశించి తీవ్రనష్టం చేస్తుంటుంది. దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా మాంకోజెబ్ 3గ్రా. మందు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.