తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కళ్లకురిచ్చి జిల్లా సెంగురిచ్చి టోల్ ప్లాజా వద్ద 40 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు రోడ్డు క్రాస్ చేస్తుండగా.. వేగంగా వచ్చిన డీజిల్ ట్యాంకర్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా 20 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడ్డవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.