రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కీలక ప్రకటన చేశారు. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను ఏరివేస్తామని, నక్సలిజం రాజకీయ సమస్య కాదని పేర్కొన్నారు. పశుపతినాథ్ నుంచి తిరుపతి వరకు రెడ్ కారిడార్‌ను, మావోయిస్టుల నెట్‌వర్క్‌ను ధ్వంసం చేశామన్నారు. ఇప్పుడు కేవలం 12 మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఉన్నాయని వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌లో సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాల పనితీరు భేష్ అని ప్రశంసించారు.