AP: విశాఖ మాస్టర్ ప్లాన్‌పై ఎమ్మెల్యేలతో మంత్రి నారాయణ ఫైనాన్షియల్ సిటీ విశాఖ మాస్టర్ ప్లాన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నేతలు తమ స్వార్థం మేరకు మాస్టర్ ప్లాన్ తయారు చేశారని, ప్రజలు నేతల అభిప్రాయాలతో నాలుగు నెలల్లో కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని సంబంధిత అధికారులకు తెలిపారు. అలాగే మే నెలాఖరులోగా మెట్రో రైలు టెండర్లు పూర్తి చేయాలని నిర్ణయించారు.