నేవీ నూతన చీఫ్‌గా దినేష్ త్రిపాఠి

60చూసినవారు
నేవీ నూతన చీఫ్‌గా దినేష్ త్రిపాఠి
భారత నావికాదళం నూతన చీఫ్‌గా అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి నియమితులయ్యారు. ఆయన మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దినేష్ త్రిపాఠికి 26వ నేవీ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు చీఫ్‌గా ఉన్న హరికుమార్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో కేంద్ర ప్రభుత్వం త్రిపాఠిని నియమించింది. 1985 జూలై 1న నౌకాదళంలోని ప్రవేశించిన త్రిపాఠి వివిధ హోదాల్లో పని చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్