రైలులో రాత్రి 10 గంటల తర్వాత ఈ పనులు చేయోద్దు

50చూసినవారు
రైలులో రాత్రి 10 గంటల తర్వాత ఈ పనులు చేయోద్దు
రైలు ప్రయాణంలో పాటించాల్సిన నిబంధనల గురించి రైల్వేశాఖ కొన్ని నియమాలు చేసింది. రైలులో రాత్రి 10 గం. తర్వాత ప్రయాణించేటప్పుడు..ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బోగీలో ఒక లైట్ మినహా మిగిలిన అన్ని లైట్లు స్విచ్ ఆఫ్ చేయాలి. ప్రయాణికులు నిద్రపోయేలా ఈ నిబంధనను చేశారు. ఎవరైనా సరే బిగ్గరగా మాట్లాడకూడదు. అలా చేస్తే, వారిపై చర్య తీసుకోవచ్చు. మిడిల్ బెర్త్‌లో ఉన్న ప్రయాణీకుడు ఆ టైమ్ లో తన సీటును ఓపెన్ చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్