సునీత కేజ్రీవాల్‌తో సమావేశమైన కల్పనా సోరెన్‌

80చూసినవారు
సునీత కేజ్రీవాల్‌తో సమావేశమైన కల్పనా సోరెన్‌
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్‌ను కలిశారు. శనివారం 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లోని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో ఆమెను కలిశారు. ఇరువురి మధ్య దాదాపు 15-20 నిమిషాల పాటు భేటీ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కల్పనా సోరెన్ మాట్లాడుతూ.. రెండు నెలల క్రితం జార్ఖండ్‌లో జరిగిన ఘటనే.. ఇప్పుడు ఢిల్లీలో కూడా జరిగిందని అన్నారు.

సంబంధిత పోస్ట్