వాస్తు ప్రకారం ఇంట్లో చీపురును ధనం, ఆభరణాలు ఉంచే చోట ఉంచకూడదని, గోడకు ఆనించి నిలబెట్టడం కూడా మంచిది కాదని నిపుణులు పేర్కొంటున్నారు. చీపురుతో పని అయిపోయిన తర్వాత ఎవరికీ కనిపించకుండా తలుపు వెనుక పెట్టాలి. అలాగే చీపురును తొక్కకూడదని, సూర్యాస్తమయం తర్వాత పట్టకూడదని అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం దూరమవుతుందంటున్నారు. పాడైన చీపురును శనివారం, అమావాస్య రోజు మాత్రమే పడేయాలి.