వర్షం నీరు, వేడిగాలులు, చెమట కారణంగా చర్మంపై దద్దుర్లు మరియు దురదలు ప్రధానంగా కనిపిస్తాయి. అయితే ఈ చిట్కాతో ఈ సమస్యలను సులభంగా అధిగమించవచ్చు అంటున్నారు చర్మవ్యాధి నిపుణులు. స్నానం చేసే ముందు ఒక చెంచా బేకింగ్ సోడాలో నిమ్మరసం పిండుకుని మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. స్నానానికి ముందు 15-20 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని శరీరమంతా మసాజ్ చేయండి. ఆ తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల దురద సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.