కుక్కలకు ప్రత్యేక గుడి.. ఎక్కడో తెలుసా?

73చూసినవారు
కుక్కలకు ప్రత్యేక గుడి.. ఎక్కడో తెలుసా?
కర్ణాటకలో ఓ వింత ఆలయం ఉంది. రామనగర జిల్లా చన్నపట్న, అగ్రహార వలగెరెహళ్లి గ్రామంలో ఉన్న ఈ ఆలయంలో కుక్కలను పూజిస్తారు. వీరమస్తి కెంపమ్మ దేవికి కుక్కలు సంరక్షకులని అక్కడి ప్రజల విశ్వాసం. అందువల్ల ఇక్కడ కుక్కల విగ్రహాలకు పూజలు చేస్తారు. తాము ఏ కోరికలు కోరితే అవి నెరవేరుతాయని, తమ కష్టాలు తీరుతాయని అక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయంలో ప్రతి ఏడాది భారీ ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్