ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ప్రైజ్‌మనీ మొత్తం రూ.60.6 కోట్లు. ఈ టోర్నీలో పాల్గొన్న ఒక్కో జట్టు రూ.1.08 కోట్లు అందుకుంటుది. అలాగే గ్రూప్ స్టేజ్‌లో విజయం సాధించిన జట్టుకు రూ.29.5 లక్షలు అందుతాయి. ఫైనల్‌లో గెలిచిన జట్టు ఏకంగా రూ.19.49 కోట్ల ప్రైజ్‌మనీ అందుకబోతోంది. ఫైనల్ మ్యాచ్‌లో ఓడి రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.9.74 కోట్లు ఇస్తారు. ఫైనల్‌లో భారత్ గెలిస్తే ఈ టోర్నీ ఆడినందుకు రూ.21.4 కోట్లు అందుకుంటుంది.