వేర్వేరు రూపాల్లో కొలువైన అమ్మవారి పేర్లతోనే కొన్ని నగరాలు వెలిశాయి. మన దేశ ఆర్థిక రాజధాని ముంబై కూడా అమ్మవారి పేరు మీదనే వెలిసింది. త్రిపుర సుందరి అమ్మవారి పేరున త్రిపుర ఏర్పడింది. మహిషాసుర మర్దిని పేరుతో మైసూర్, అంబ జోగేశ్వరి పేరుతో అంబ జోగె( మహారాష్ట్ర), కన్యాకుమారి దేవి పేరుతో కన్యాకుమారి ఏర్పడింది. తుల్జా భవానీ పేరుతో తుల్జాపూర్ (మహారాష్ట్ర), భవానీ అంబాదేవి పేరుతో అంబాలా (హర్యానా), సమలైదేవి పేరుతో సంబల్‌పుర్(ఒడిశా) నగరాలు ఏర్పడ్డాయి.