తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లవ్ స్టోరీ గురించి మీకు తెలుసా.?

3319చూసినవారు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లవ్ స్టోరీ గురించి మీకు తెలుసా.?
నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. రేవంత్ రెడ్డి తాను చదువుకునే రోజుల్లో ప్రేమించిన గీతా రెడ్డినే పెళ్లి చేసుకున్న విషయం ఇప్పటికే చాలా మందికి తెలుసు. వీరిద్దరి ప్రేమ ప్రయాణం ఓ బోటులో మొదలైందట. ఇంటర్ చదివే రోజుల్లో నాగార్జునసాగర్ వెళ్లిన రేవంత్ రెడ్డి బోటులో గీతారెడ్డిని తొలిసారి చూశారట. ఆమె ఫ్యామిలీ డీటెయిల్స్ సేకరించే క్రమంలో మొదలైన వీరి పరిచయం స్నేహంగా మారింది. క్రమంగా ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. వీరి ప్రేమ గురించి తెలిసి గీతారెడ్డి ఫ్యామిలీ ముందు సుముఖత చూపలేదు. కొంతకాలం అనంతరం రేవంత్ రెడ్డి నేరుగా గీతారెడ్డి తరపు పెద్దలతో మాట్లాడి తన ప్రేమను గెలిపించుకున్నారు.

సంబంధిత పోస్ట్