TG: సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట వల్ల ఓ మహిళ మృతి చెందిన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టై, బెయిల్‌పై వచ్చిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌ను ఓ సీఐ అరెస్ట్ చేశారు. ఆయనే బానోత్ రాజు నాయక్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బన్నీకి రాజు నాయక్ పెద్ద అభిమాని. అర్జున్‌తో ఒక్కసారైనా ఫొటో దిగాలని అనుకునేవారట. కానీ చివరికి తన అభిమాన నటుడినే అరెస్ట్ చేసే రోజు వస్తుందని ఆయన ఊహించలేదు.