గుండె మార్పిడి కోసం హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్ కామినేని ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి మెట్రోలో గుండెను శనివారం తీసుకెళ్లారు. గుండె భద్రపరిచిన బాక్సుతో బయల్దేరిన వైద్యులు నాగోల్ నుంచి మెట్రో రైలు ఎక్కి జూబ్లీహిల్స్‌లో దిగి.. అక్కడి నుంచి అంబులెన్స్‌లో గ్రీన్‌ఛానల్ ద్వారా అపోలో ఆసుపత్రికి చేరారు. 44 ఏళ్ల వ్యక్తికి గుండె సమస్య వల్ల మృత్యువుతో పోరాడుతుండగా ఈ గుండెను అమర్చారు.