పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పశ్చిమ మేదినీపూర్ జిల్లా చంద్రకోనలోని ఘటల్-మేదినీపూర్ రాష్ట్ర రహదారిపై అతివేగంతో వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.