యజమాని కోసం అంబులెన్స్ వెనుక పరుగులు తీసిన కుక్క (వీడియో)

71చూసినవారు
కుక్క అంటే విశ్వాసానికి మారుపేరు అని పెద్దలు అంటారు. అయితే ఆ విషయాన్ని గుర్తుచేసే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తికి అనారోగ్యంగా ఉండటంతో అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలిస్తున్నారు. దీంతో యజమానిని విడిచి ఉండలేని అతడి పెంపుడు కుక్క అంబులెన్స్ వెనుకే చాలా దూరం పరుగులు తీసింది. దీంతో సిబ్బంది కుక్కను కూడా లోపలికి ఎక్కించారు. ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు.

సంబంధిత పోస్ట్