స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ తొలి ఒప్పందం చేసుకున్నారు. యూనిలీవర్ కంపెనీతో చర్చలు విజయవంతమైనట్లు సీఎం రేవంత్ బృందం ప్రకటించింది. వినియోగ వస్తువుల తయారీలో యూనిలీవర్ కంపెనీ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఈ కంపెనీ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.