వాటిని చూసి మోసపోవొద్దు: LIC

70చూసినవారు
వాటిని చూసి మోసపోవొద్దు: LIC
ప్రభుత్వ రంగ సంస్థ LIC బుధవారం కీలక ప్రకటన జారీ చేసింది. సోషల్ మీడియా వేదికల్లో కొందరు LIC పేరుతో మోసపూరిత ప్రకటనలు ఇస్తున్నట్లు గుర్తించామని తెలిపింది. వారు LIC లోగో, బ్రాండ్ నేమ్, సీనియర్ అధికారుల ఫొటోలు పెట్టి ప్రకటనలు ఇస్తున్నారని వెల్లడించింది. ఆ ప్రకటనలు చూసి మోసపోవొద్దని సూచించింది. అలాంటి ప్రకటనలు గుర్తిస్తే తమకు సమాచారం అందించాలని కోరింది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్