జిమ్‌లో మహిళ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ (వీడియో)

84చూసినవారు
వివాహ వేడుకల సమయంలో ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ సాధారణమైపోయింది. అయితే కొందరు వినూత్నంగా ఫొటోషూట్ నిర్వహిస్తున్నారు. ఇదే కోవలో ఓ మహిళ పెళ్లికుమార్తెలా రెడీ అయింది. పట్టుచీర ధరించి, ఆభరణాలు పెట్టుకుంది. అనంతరం జిమ్‌లో డంబెల్స్‌తో కసరత్తులు చేసింది. బైసెప్స్, ట్రైసెప్స్ వ్యాయామాలు చేస్తూ ఫొటోలు తీయించుకుంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోకు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్