కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లలతో పోలుస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆటిజం సమస్యలు తగ్గుతాయని భావిస్తుంటారు. అయితే ఈ పద్దతి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు. ఆటిజం ఉన్న వారిలో కూడా ఎన్నో నైపుణ్యాలు ఉంటాయి. ఇలా ఆటిజం ఉన్నప్పటికీ అపురూప విజయాలు సాధించిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిని ఉదాహరణగా తీసుకుని పిల్లల్లోని ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి దానికి తగ్గ తోడ్పాటు అందించాలి.