ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ అధికారుల విచారణ మొదలుపెట్టారు. ఈ క్రమంలో SRH, HCA మధ్య జరిగిన ఈ-మెయిల్స్‌ను అధికారులు చెక్ చేస్తున్నారు. ఐపీఎల్‌కు ముందు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలపై విచారిస్తున్నారు. ఇప్పటికే గత రెండేళ్లుగా HCA చేపట్టిన రెనోవేషన్స్ వాటికి సంబంధించిన లెక్కలను కూడా పరీశీలిస్తున్నారు. SRH, HCA మధ్య ఐపీఎల్‌కు ముందు జరిగిన ఒప్పందాలకు సంబంధించి రికార్డులను చెక్ చేస్తున్నారు.