భార్య చేసిన పనికి ఓ పోలీస్ కానిస్టేబుల్ ఇబ్బందుల్లో పడ్డాడు. చంఢీఘర్‌కు చెందిన అజయ్ కుందు, జ్యోతి భార్యాభర్తలు. అయితే కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అజయ్ కుందు భార్య జ్యోతి సెక్టార్ 20 గురుద్వారా చౌక్‌లోని రోడ్డు మీద జీబ్రా క్రాసింగ్‌పై డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను అజయ్ అకౌంట్ నుంచి భార్య జ్యోతి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. దీంతో ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో అధికారులు అజయ్‌ను సస్పెండ్ చేశారు.