బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖ నటి తమన్నా భాటియా నవరాత్రులు సందర్భంగా తన నివాసంలో మాతా కీ చౌకీ ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక పూజలో కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. తమన్నా పూజ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా నృత్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.