ఇటీవల జరిగిన ఎంపీపీ, జడ్పీ ఉప ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన నేతలతో మాజీ సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఈ ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపుకు సహకరించిన వారితో ఆయన స్వయంగా భేటీ అయి, వారికి అభినందనలు తెలపనున్నారు. ఈ సమావేశం ద్వారా నేతలకు ప్రోత్సాహం ఇచ్చి, భవిష్యత్తులో పార్టీకి మరింతగా పనిచేయడానికి ప్రేరణ కలిగించాలనే ఉద్దేశ్యంతో ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం.