AP: ఎన్టీఆర్ జిల్లాలోని కంచికచర్ల మండలంలో మంగళవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పింఛను సొమ్ముతో కంచికచర్ల సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ పరార్ అయ్యాడు. కంచికచర్ల సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న తరుణ్ రూ. 7.50 లక్షల పెన్షన్ సొమ్ముతో పారిపోయాడు. ఈ నేపథ్యంలో అతనిపై ఎంపీడీఓ లక్ష్మికుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తరుణ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.