వాస్తుశాస్త్రం ప్రకారం కూడా మనీ ప్లాంట్‌కు చాలా ప్రాధాన్యత ఉంది. ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుందని అంటారు. నెగెటివ్ ఎనర్జీని దూరం చేస్తుందని నమ్మకం. మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే అది నేలను ఏ విధంగానూ తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మనీ ప్లాంట్ ఎప్పుడూ ఎండిపోకూడదు. ఒకవేళ ఎండితే వెంటనే తొలగించాలి. దీనిని కుండీలోనే పెంచాలి. మనీ ప్లాంట్‌ను పాదాల దగ్గర కాకుండా తల దగ్గర ఉండేలా చూసుకోవాలి.