అల్లరి నరేశ్ ఇప్పుడు తన రూట్ మార్చాడు. కాసరగడ్డ దర్శకత్వంలో హారర్ బ్యాక్ డ్రాప్‌లో '12ఎ రైల్వే కాలనీ' అనే మూవీ చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టైటిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ‘ప్రాణాలతో బయటకు పోవుడు అవసరం లేదన్న’ అంటూ టీజర్ చివరలో అల్లరి నరేశ్ చెప్పే సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి.